గోవా, మణిపూర్లో సిట్టింగ్ సీఎంలకు సెకండ్ ఛాన్స్..!

గోవా, మణిపూర్లో సిట్టింగ్ సీఎంలకు సెకండ్ ఛాన్స్..!

న్యూఢిల్లీ : నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ.. సీఎం అభ్యర్థులను ఖరారు చేసే పనిలో బిజీగా మారింది. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్కు రెండోసారి  అవకాశమివ్వడం దాదాపు ఖాయమైంది. ఈ క్రమంలో గోవా, మణిపూర్ రాష్ట్రాల సీఎంల పేర్లు సైతం ఖరారు చేసినట్లు సమాచారం. గోవాలో ప్రమోద్ సావంత్, మణిపూర్లో ఎన్. బీరేన్ సింగ్కు రెండోసారి పాలనా పగ్గాలు అప్పగించేందుకు బీజేపీ అధిష్టానం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రమోద్ సావంత్, బీరేన్సింగ్లు ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమైనట్లు సమాచారం.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో మాత్రం బీజేపీ హైకమాండ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఉత్తరాఖండ్లో బీజేపీ విజయఢంకా మోగించినప్పటికీ సీఎం అభ్యర్థి పుష్కర్ సింగ్ ధామీ ఓటమి పాలయ్యారు. ఖతిమా నియోజవర్గం నుంచి పోటీ చేసిన ఆయన..  కాంగ్రెస్ అభ్యర్థి భువన్ చంద్ర కప్రీ చేతిలో పరాభవం పాలయ్యారు. 46 ఏళ్ల పుష్కర్ సింగ్ ధామీ గతేడాది తీరథ్ సింగ్ రావత్ స్థానంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన నాలుగు రాష్ట్రాల్లో హోలీ తర్వాత కొత్త సర్కారు కొలువుదీరనుంది.

మరిన్ని వార్తల కోసం..

కేటీఆర్ పర్యటనతో 3 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్

పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణం