టీఆర్ఎస్ లోకి మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!

టీఆర్ఎస్ లోకి మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!

కాంగ్రెస్​ పార్టీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు షాక్​ ఇచ్చారు. కారు సీట్లో కూర్చునేందుకు సిద్ధమయ్యారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్​ రావు, ఎల్​బీ నగర్​ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్​ రెడ్డి గులాబీ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. శుక్రవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో టీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​తో వాళ్లిద్దరూ భేటీ అయినట్టు తెలుస్తోంది. శుక్రవారం ఉదయమే కేటీఆర్​తో వనమా సమావేశమై పార్టీ మారడంపై చర్చించినట్టు సమాచారం. పార్టీలో ఎప్పుడు చేరేది ఒకట్రెండు రోజుల్లో ఆయన స్పష్టతనిచ్చే అవకాశముందని తెలుస్తోంది. కేటీఆర్​తో భేటీ తర్వాత ఆయన తిరుమల వెళ్లారు. నియోజకవర్గానికి చెందిన కొందరు కీలక నేతలనూ వెంకన్న దర్శనానికి ఆయన రమ్మని చెప్పినట్టు సమాచారం. అక్కడే పార్టీ మార్పు పై వారితో చర్చించే అవకాశముందని చెబుతున్నారు. ఇక, సుధీర్​రెడ్డి సాయంత్రం కేటీఆర్​ను కలిసినట్టు తెలుస్తోంది. నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్​ఎస్​లోకి వెళుతున్నట్టు తన అనుచరులతో ఆయన చెప్పినట్టు సమాచారం. ఆయన కూడా రెండ్రోజుల్లో పార్టీలో చేరడంపై అధికారిక ప్రకటన విడుదల చేస్తారని తెలుస్తోంది.