
ఖమ్మం MLC ఎన్నికల్లో TRS అతి కష్టం మీద గెలిచిందన్నారు CLP నేత భట్టి విక్రమార్క. TRS ఓటర్లు కూడా కాంగ్రెస్ కే జై కొట్టారన్నారు. కాంగ్రెస్ కు అభ్యర్ధే లేరని హేళన చేసినా TRSకి చుక్కలు చూపెట్టామన్నారు. సంఖ్య పరంగా TRS గెలిచినా.. నైతిక విజయం కాంగ్రెస్ దేనన్నారు. అధికార పార్టీకి మెజారిటీ ఓట్లున్నా.. క్యాంపు రాజకీయాలు చేయాల్సిన దుస్ధితి వచ్చిందన్నారు భట్టి.