
దేశంలో ప్రాజెక్టులు కట్టి వ్యవసాయం, విద్యుత్ ని తెచ్చింది జవహర్ లాల్ నెహ్రూ అని తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. మోదీ పదేళ్లలో ఎన్ని ప్రాజెక్టులు కట్టారో, ఎన్ని కంపెనీలు పెట్టారో, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు జగ్గారెడ్డి. ఆస్తులు పోగుచేసింది కాంగ్రెస్ అయితే.. ధారధాత్తం చేస్తోంది మోదీ అని విమర్శించారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్, మంజీరా, సింగూరు వంటి ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ అని తెలిపారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ ఏం చేసింది అని ప్రశ్నిస్తున్న కిషన్ రెడ్డి, కేసీఆర్ కూడా.. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టు నీళ్లు తాగినవాళ్లేనన్నారు. బీజేపీకి పదేళ్లలో ఏం చేశారో చెప్పుకునే దమ్ముందా అని ప్రశ్నించారు జగ్గారెడ్డి. విశాఖ ఉక్కు తెచ్చింది తామేనని.. అమ్మకానికి పెట్టింది మాత్రం మోదీ అని విమర్శించారు. బీజేపీలో పదవులు అడిగితే ఉన్న పదవి పోతుందని.. బీఆర్ఎస్‌లో పదవి అడిగే పరిస్థితే ఉండదన్నారు. కాంగ్రెస్‌లో మాత్రం అలా ఉండదన్నారు జగ్గారెడ్డి.