ఎన్ని తప్పులు చేసినా.. రాజగోపాల్ రెడ్డికి పార్టీ టికెట్లు ఇచ్చింది

ఎన్ని తప్పులు చేసినా.. రాజగోపాల్ రెడ్డికి పార్టీ టికెట్లు ఇచ్చింది

కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని అవమాన పరిచేలా రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారని పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కోదండ రెడ్డి అన్నారు. ఈ రోజు గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖతం అయిపోయిందని అని అనడం వల్ల రాజగోపాల్ రెడ్డి కి నోటీస్ ఇచ్చామని అన్నారు.  షోకాజ్ నోటీస్ ఇచ్చినా.. తీరు మార్చుకోకుండా మళ్ళీ అవే మాటలు ప్రెస్ మీట్ లో రిపీట్ చేసారన్నారు.  షోకాజ్ నోటీస్ కు రిప్లై కూడా చాలా కఠినంగా ఇచ్చారని అన్నారు.తాను ఇచ్చిన రిప్లై లెటర్ లో బీజేపీ లో చేరుతాను అనే మాటలను అందులో రాయలేదని, కాంగ్రెస్ లోనే కొనసాగుతానని కూడా ఎక్కడా చెప్పలేదని అన్నారు. సస్పెండ్ చేయడం లో కొంత ఆలస్యం మైన మాట వాస్తవమేనని, ఈ లేఖ ఎప్పుడో ఇస్తే బాగుండునని కోదండరెడ్డి అన్నారు.

పార్టీ విలువలను కాపాడడానికి తప్పు చేసిన వారికి షోకాజ్ నోటీస్ లు ఇస్తామని కోదండ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎన్ని మాటలు మాట్లాడినా.. రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ  టికెట్ లు ఇచ్చిందన్నారు. 2018 లో కూడా రాజగోపాల్ కు షోకాజ్ నోటీసులు అందాయని,కానీ అప్పుడు తప్పు గా మాట్లాడాను అని ఇంచార్జ్ తో  ఒప్పు కోవడంతో ఆయనపై చర్యలు తీసుకోలేదన్నారు. ఇంత జరిగినా.. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ టికెట్ రాజగోపాల్ ఇచ్చిందని, తన బాధ్యతలను నిర్వర్తించడంలో  రాజగోపాల్ రెడ్డి విఫలమయ్యారని కోదండ రెడ్డి అన్నారు.

ఏ పార్టీ నుండి ఎన్నికైన వారైనా  కొన్ని విలువులతో ఉండాలని కోదండ రెడ్డి అన్నారు. ఆర్ నారాయణ మూర్తి సినిమా చూసైనా.. రాజకీయ నాయకుల తీరు మారాలని ఈ సందర్భంగా  అన్నారు