- కాంగ్రెస్నేత మైనంపల్లి హన్మంతరావు
నిజాంపేట, వెలుగు: బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు కలలు కంటున్నాడని కాంగ్రెస్రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఎద్దేవా చేశారు. ఆయనను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఓడగొట్టి బీఆర్ఎస్ దుకాణం బంద్ చేయిస్తానని చాలెంజ్చేశారు. మెదక్ జిల్లా నిజాంపేటలో శుక్రవారం జరిగిన కాంగ్రెస్ సర్పంచ్ ల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్రెడ్డి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ ప్రభుత్వం అధికారంలో ఉందని సంయమనం పాటిస్తున్నామన్నారు. నిజాంపేట మండలంలో 16 పంచాయితీలు ఉండగా 10 గ్రామాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం కార్యకర్తల కృషి వల్లే సాధ్యమైందన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత తనదని చెప్పారు. ఇదే ఉత్సాహంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునేందుకు పట్టుదలతో పనిచేయాలని సూచించారు. నిజాంపేట మండల కేంద్రంలో తహసీల్దార్, ఎంపీడీఓ, పీఎస్లకు సొంత బిల్డింగ్లు, ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
చల్మెడ తిరుమల స్వామి ఆలయంలో వచ్చే నెలలో బ్రహ్మోత్సవాలు ఉన్నందున రోడ్డు పనులు త్వరగా కంప్టీట్ చేయాలని కాంట్రాక్టర్ కిషన్ రావు కు సూచించారు. కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ నాయకులు అమర్సేనా రెడ్డి, వెంకటేశ్ గౌడ్, బాల్ రెడ్డి, మహేందర్, నసీరుద్దీన్, లస్మ గౌడ్, లింగం గౌడ్, సర్పంచ్ లు భానుప్రకాశ్ రెడ్డి, మంజుల, మల్లేశం పాల్గొన్నారు.
