కేసీఆర్.. సీబీఐ ఎంక్వయిరీకి సిద్ధమా?: పొన్నాల

కేసీఆర్.. సీబీఐ ఎంక్వయిరీకి సిద్ధమా?: పొన్నాల

కేసీఆర్ తెలంగాణ వాడు కాదు కాబట్టే తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడన్నారు మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణా వాడు కాకున్నా… తెలంగాణకు మంచి చేస్తే నమస్కరిస్తామని ఆయన అన్నారు. ఆగస్టు 15 నుండి అద్భుత పాలన చేస్తానన్న కేసీఆర్..  గత 5 సంవత్సరాల నుండి ప్రజా కంఠక పాలన ఉందని ఒప్పుకుంటున్నారా  అని ప్రశ్నించారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకోసం ఆరోగ్య శ్రీ పథకం తీసుకొస్తే.. ఈ రోజు ఆ పథకం పనిచేయకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు.

కల్యాణ లక్ష్మి,  షాదీ ముబారక్,రైతుబందు పెండింగ్ లో ఉన్నాయని,  108 ఉద్యోగులకు జీతాలు లేవని ఇది వాస్తవం కాదా అంటూ సీఎంపై మండి పడ్డారు పొన్నాల. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని 6 మాసాలు గడచిన ఇంతవరకు దానిపై ఎలాంటి ఊసు లేదన్నారు.  ఫీజు రీ అంబర్స్ మెంట్ నుకాలరాస్తున్నది కేసీఆరేనని అన్నారు.

ప్రజా ప్రతినిధులు నాటిన చెట్లు కపడకపోతే ఉద్యోగాలు పోతున్నాయి, మరి కేసీఆర్ చేసిన అన్యాయాలపై ప్రజలు ఎలాంటి శిక్ష వేయాలన్నారు లక్ష్మయ్య . అంగన్ వాడి లలో మహిళలకు పౌష్టిక ఆహారం,పాలు ఇంతవరకు ఇవ్వడం లేదు, 9మాసాల నుండి సర్పంచ్ లకు ఉంతవరకు చెక్ పవర్ ఇవ్వలేదంటూ సీఎం తీరును ఎండగట్టారు.

కేసీఆర్ అవినీతికోసం అనేక కొత్త పథకాలు తీసుకువస్తున్నారని,  కొత్త చట్టాలు తీసుకువస్తామని చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నాడున్నారు. కొత్త మున్సిపల్ చట్టం తెస్తానన్న ఈ కేసీఆర్ ప్రభుత్వ తీరు ఎలా ఉందంటే…కొండనాలుకకు మందేస్తే,ఉన్ననాలుకకు ఊడినట్టు ఉందన్నారు.  హై కోర్టు కేసీఆర్ ప్రభుత్వం మీద అక్షింతలు వేస్తుంది.కొత్త మున్సిపల్ చట్టం పైన  మీది తప్పు లేకుంటే మీరూ సీబీఐ ఎంక్వైరీ కి సిద్ధం కండి.

మా రాష్ట్రానికి ఏమీ వద్దు.. కేవలం మీ ప్రేమ చాలు అని మోడీని అడిగిన కేసీఆర్… తన అవినీతి బయటపడకుండా ఉండేందుకే ఈ ఎత్తులు వేస్తున్నారని పొన్నాల అన్నారు.