- లోక్ సభలో మోదీ చేసింది ఇదే
- మణిపూర్ అంశాన్ని తమాషాగా మార్చారు
- రాష్ట్రం తగులబడుతుంటే నవ్వుతూ జోకులేశారు
- కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్
ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ధ్వజమెత్తారు. పార్లమెంట్లో మోదీ మణిపూర్ అంశాన్ని తమాషా చేశారంటూ మండిపడ్డారు. రెండు గంటల ప్రసంగంలో మణిపూర్ అంశాన్ని రెండు నిమిషాలు మాత్రమే ప్రస్తావించారన్నారు. ‘ఈశాన్య రాష్ట్రం తగలబడుతుంటే సభలో ప్రధాని నవ్వుతూ జోకులు వేశారు. ఈ హింసను ఆయన ఎందుకు ఆపలేకపోయారంటూ రాహుల్ ప్రశ్నించారు.
భారత్‌ను హత్య చేశారని నేను అనలేదు. మణిపూర్‌ను హత్యచేశారు.. రెండుగా చీల్చారని చెప్పడమే నా ఉద్దేశం. నిప్పుల గుండంలా రగులుతున్న మణిపూర్‌లో బీజేపీ మరింత ఆజ్యం పోసింది. అక్కడి దారుణ పరిస్థితులు చూసి కేంద్ర దళాలే ఆశ్చర్యపోయాయి. మోదీ వ్యవహరించిన తీరు సరైంది కాదు’ అంటూ రాహుల్ మండిపడ్డారు.