
వయనాడ్ ఎంపీగా తప్పుకోవడం బాధగా ఉందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కష్ట సమయంలో వెన్నుదన్నుగా ఉన్నారన్నారు. తనపై చూపిన ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. ఎంపీగా రాజీనామా చేస్తున్నా.. వాయనాడ్ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని తెలిపారు.
వయనాడ్ ఎంపీగా పోటీ చేస్తున్న ప్రియాంక గాంధీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తనకంటే గొప్పగా ప్రజా సేవ చేస్తుందన్నారు. ఈ మేరకు వయనాడ్ ప్రజలకు భావోద్వేగపూరితమైన లేఖ రాశారు రాహుల్ గాంధీ.
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో రెండు స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే...దీంతో వయనాడ్ ఎంపీ సీటు వదులుకుంటున్నట్లు రాహుల్ ప్రకటించారు. గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ నుంచి రాహుల్ ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు.