ఓట్ చోరీ తోనే మోదీ ప్రధాని అయ్యారు.. ఆ విషయం జెన్-Z కు తెలిసేలా చేస్తాం : రాహుల్ గాంధీ

ఓట్ చోరీ తోనే మోదీ ప్రధాని అయ్యారు.. ఆ విషయం జెన్-Z కు తెలిసేలా చేస్తాం : రాహుల్ గాంధీ

ఓట్ల చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు కొనసాగిస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా ప్రధానిమోదీపై సంచలన ఆరోపణలు చేశారు రాహుల్. ఓట్ల దొంగతనంతోనే నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారని ఆరోపించారు. 2025 నవంబర్ 7వ తేదీన ఢిల్లీలో మాట్లాడిన రాహుల్.. మోదీ ఎలా ప్రధాని అయ్యారో జెనరేషన్ - Z యూత్ కు చూపిస్తామని అ్నారు. 

ఓట్ చోరీపై తమ వద్ద చాలా ఆధారాలున్నట్లు చెప్పారు రాహుల్. ఇటీవలే హర్యానాలో ఓట్ చోరీ జరిగిందని ఆధారాలు బయటపెట్టిన రాహుల్..  ఆ రాష్ట్రంలో హోల్ సేల్ ఓట్ చోరీ జరిగిందని ఆరోపించారు. దేశంలో జరిగిన ఓట్ చోరీపై ప్రజలకు వివరించే ప్రక్రియకు కొనసాగిస్తామని చెప్పారు. 

హర్యానాలో బీజేపీ నేత రెండు చోట్ల ఓట్లు వేసినట్లు చెప్పిన ఆయన.. ఇన్ని సాక్ష్యాలు చూపిస్తున్నా ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి స్పందన లేదని అన్నారు. ఫేక్ ఓట్లు, ఫేక్ ఫోటోలతో ఓట్ చోరీ జరుగుతోందని అన్నారు. బీజేపీ ఆత్మరక్షణలో పడిందని.. కానీ చర్చించే దమ్ము వాళ్లకు లేదన్నారు.

బ్రెజిల్ మోడల్ కు ఇండియాలో ఎలా ఓటు హక్కు ఉంటుంది..? ఈ విషయంలో ఇప్పుడిప్పుడే మీడియా కూడా కాస్త ఫోకస్ చేస్తోందని చెప్పారు. 

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఎన్నికల సంఘం కలిసి రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని విమర్శించారు. ఒక పౌరుడికి ఒకే ఓటు ఉండాలని రాజ్యాంగం చెబుతోంది.. కానీ హర్యానాలో ఒక వ్యక్తివి ఎక్కువ ఓట్లు అన్నట్లు తయారైంది పరిస్థితి. మధ్య ప్రదేశ్, చత్తీస్ ఘర్, హర్యానా, గుజరాత్ లో జరిగిందే  నెక్స్ట్ బీహార్ లో జరగబోతోందని అన్నారు రాహుల్.