వీడియో: రైతు దంపతులపై పోలీసుల అరాచకం.. ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ

వీడియో: రైతు దంపతులపై పోలీసుల అరాచకం.. ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ

దళిత రైతు దంపతులపై మధ్యప్రదేశ్ పోలీసులు విరుచుకుపడ్డారు. లాఠీలతో ఇష్టమొచ్చినట్లు కొట్టుకుంటూ.. కాళ్లూ, చేతులు పట్టుకొని ఈడ్చుకెళ్లారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఆయన ‘మేం ఇటువంటి అన్యాయాలకు వ్యతిరేకం’అని ట్వీట్ చేశారు. ఈ ఘటన జ్యోతిరాధిత్య సింధియా యొక్క సొంత నియోజకవర్గమైన గుణలో జరిగింది.

గుణాకు చెందిన రామ్ కుమార్ అహిర్వర్ (38), సావిత్రి దేవి (35) అనే రైతు దంపతులు ప్రభుత్వ భూమిలో కొన్ని ఏండ్లుగా పంటను పండిస్తున్నారు. అయితే ఆ భూమిలో కాలేజీ కట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం రెవెన్యూ అధికారులు.. పోలీసుల సహాయంతో భూమిని స్వాధీనం చేసుకోని.. ప్రహరీ గోడ కట్టడానికి వెళ్లారు. అయితే తమ పంటను నాశనం చేసి.. గోడ కట్టడాన్ని ఆ రైతు దంపతులు అడ్డుకున్నారు. దాంతో అక్కడే ఉన్న పోలీసులు రెచ్చిపోయి విపరీతంగా కొట్టారు. దాంతో రైతు దంపతులు.. కష్టపడి పండించిన పంట కళ్ల ముందే నాశనమవుతుంటే చావడం తప్ప ఏం చేయలేమని ఆ దంపతులు క్రిమిసంహరక మందు తాగారు. దాంతో అధికారులు వారిని ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్సిస్తుంటే ఆ దంపతుల పిల్లలు పోలీసులను అడ్డుకున్నారు. వారిని కూడా పోలీసులు ఈడ్చి పడేసి ఇష్టమొచ్చినట్లు కొట్టారు. ప్రస్తుతం ఆ జంట స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. కళాశాల భవనం కోసం కేటాయించిన 5.5 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఈ జంట పంటలు పండించినట్లు ప్రభుత్వం పేర్కొంది. రామ్ కుమార్ అహిర్వార్ మరియు సావిత్రి దేవి అక్కడ సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారని మరియు భూమికి రూ .3 లక్షలు చెల్లించారని సమాచారం.

‘ఇది ఎవరి భూమి అని మాకు తెలియదు. మేం చాలాకాలంగా ఇక్కడే వ్యవసాయం చేస్తున్నాం. మా పంటను నాశనంచేస్తున్నప్పుడు.. మేం చావడం తప్ప మాకు వేరే మార్గం లేదు’ అని సావిత్రి దేవి విషం తాగాడానికి ముందు అన్నారు.

ఆ వీడియోలో చూస్తే.. చాలామంది పోలీసులు, అధికారులు అక్కడ ఉన్నట్లు తెలుస్తుంది. ఒక రైతు కుటుంబాన్ని అడ్డుకోవడానికి ఇంతమంది వచ్చారా అని ఆశ్చర్యపోవాల్సిందే. ఈ ఘటనపై గుణ మాజీ ఎంపీ జ్యోతిరాధిత్య సింధియా స్పందించారు. ‘ఈ ఘటన తర్వాత గుణ ఎస్పీ మరియు కలెక్టర్లను తొలగించారు. ఈ సంఘటనపై విచారణ చేయాలని కోరాం. ఈ దారుణమైన చర్యకు కారణమైన వారందరిపై చర్యలు తీసుకుంటారని నాకు నమ్మకం ఉంది’ అని సింధియా ట్వీట్ చేశారు.

‘మేం మొత్తం సంఘటనను పరిశీలించి ఫుటేజీని తనిఖీ చేశాం. రైతు దంపతులు పురుగుల మందు తాగిన తర్వాత మాత్రమే వారిని ఆస్పత్రికి తరలించవలసి వచ్చింది. ఒకవేళ వారిని ఆస్పత్రికి తీసుకెళ్లకపోతే వారు చనిపోయేవారు’ అని గుణా జిల్లా కలెక్టర్ ఎస్ విశ్వనాథ్ అన్నారు.
కాగా.. రైతు దంపతులను అమానుషంగా లాఠీలతో కొట్టి.. కాళ్లతో తన్నిన పోలీసులకు క్లీన్ చిట్ ఇచ్చారు. పైగా.. రామ్ అహిర్వర్ మరియు అతని భార్యపై పోలీసులు పలు అభియోగాలు మోపారు. ఈ ఘటన తర్వాత కలెక్టర్ విశ్వనాథ్ ను తొలగించారు.

For More News..

ఇండియా, అమెరికా టాప్ సీఈవోల భేటీ

రూ. కోటిన్నర బిల్లు మాఫీ చేసి.. విమాన టిక్కెట్లు కొనిచ్చి మరీ..

కరోనా క్రైసిస్‌‌‌‌తో.. ఉద్యోగాల తీరు మారింది

సర్కారీ పోర్టల్ హ్యాక్ చేసిన అన్నదమ్ములు