గోవాలో రాహుల్ గాంధీ పర్యటన

గోవాలో రాహుల్ గాంధీ పర్యటన

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గోవాలో ఆయన పర్యటించనున్నారు. వచ్చేనెల 2వ తేదీన రాహుల్ గోవాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. సీఎం నియోజకవర్గం సాంక్విలిమ్ లో వర్చువల్ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు రాహుల్. త్వరలో ఎన్నికలు జరుగనున్న గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ కొనసాగుతున్నారు. 

ఈ ఏడాది మొత్తం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 403, పంజాబ్‌లో 117, ఉత్తరాఖండ్‌లో 70, మణిపూర్‌లో 60, గోవాలో 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. కోవిడ్‌ను దృష్టిలో ఉంచుకుని ఎన్నికలకు ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం.పోలింగ్ స్టేషన్లలో శానిటైజర్లు,మాస్కులు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. అనేక రాజకీయ పార్టీలు ఇప్పటికే రాజకీయ ర్యాలీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా డిజిటల్ ప్రచారాలపై ఎక్కువ దృష్టి సారిస్తున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో 18.4 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. అందులో 8.5 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు సీఈసీ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: 

మేడారం జాతరకు ఎలాంటి అడ్డంకులు లేవు

ఎమ్మెల్యే పైళ్ల శేఖ‌ర్ రెడ్డి ఆఫీసు ముట్టడించిన యూత్ కాంగ్రెస్ నేతలు