చైనా పేరు చెప్పడానికి భయమెందుకు.?

చైనా పేరు చెప్పడానికి భయమెందుకు.?

న్యూఢిల్లీ: మన భూభాగంలోకి చొచ్చుకొచ్చిన చైనా పేరు ఎత్తడానికి అధికారంలో ఉన్న వారికి ఎందుకు అంత భయమని ప్రధాని మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. శనివారం కాంగ్రెస్ పార్టీ స్పోక్స్  పర్సన్ రణదీప్ సింగ్ సుర్జేవాలా మాట్లాడారు. ‘ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, 130 కోట్ల ప్రజలు మన సైన్యం పట్ల గర్వంగా, విశ్వాసంతో ఉన్నారు. చైనా ఆక్రమణకు పాల్పడినప్పుడల్లా ధీటుగా జవాబిస్తున్నఆర్మ్డ్ ఫోర్సెస్కు మేం సెల్యూట్ చేస్తున్నాం. అయితే అధికారంలో ఉన్నవాళ్లు ఏం చేస్తున్నారు? చైనా పేరెత్తడానికి ఎందుకు భయపడుతున్నారు’ అని ప్రశ్నించారు.