సోమనపల్లిలో సీఎం, ఎమ్మెల్యే, ఎంపీ ఫొటోలకు క్షీరాభిషేకం

సోమనపల్లిలో సీఎం, ఎమ్మెల్యే, ఎంపీ ఫొటోలకు క్షీరాభిషేకం

చెన్నూరు/బెల్లంపల్లి, వెలుగు: చెన్నూరు మండలంలోని సోమనపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మణానికి ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తంచేశారు. నియోజకవర్గంలోని బడుగు బలహీనర్గాలకు విద్యార్థులకు నాణ్యమైన, ఉచిత విద్యను అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కూల్స్ ను శాంక్షన్ చేసిందన్నారు. 

సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణకు ధన్యవా దాలు తెలుపుతూ స్కూల్ శంకుస్థాపన శిలాఫలకం వద్ద వారి ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. బెల్లంపల్లిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు కావడంతో పట్టణంలోని గాంధీ చౌక్ రోడ్డులో కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య ఆధ్వర్యంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.