ఆర్టీసీ చార్జీల పెంపు ప్రతిపాదనపై కాంగ్రెస్ నిరసన

 ఆర్టీసీ చార్జీల పెంపు ప్రతిపాదనపై కాంగ్రెస్ నిరసన

ఆర్టీసీ చార్జీల పెంపు ప్రతిపాదనపై కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బస్సు చార్జీలను పెంచి  సామాన్యుల నడ్డి  విరుస్తున్నారని మహిళా కాంగ్రెస్  అధ్యక్షురాలు సునీతారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ  హైదరాబాద్ లోని MGBS దగ్గర నిరసన  చేపట్టేందుకు  బయలుదేరుతుండగా..మహిళ కాంగ్రెస్  నేతలను గాంధీభవన్  వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, మహిళా కాంగ్రెస్  కార్యకర్తలకు  మధ్య కాసేపు తోపులాట జరిగింది. ఇష్టారాజ్యంగా  ఆర్టీసీ ఛార్జీలు  పెంచితే  ఎలా అంటూ సునీతారావు ప్రశ్నించారు. ఆర్టీసీ బస్సు ఛార్జీలు మళ్ళీ పెంచేందుకు  ఆలోచన చేస్తున్నారన్న  సునీతారావు.. చార్జీలు పెంచితే ఊరుకునేది  లేదన్నారు.