ప్రశ్నించినోళ్లపై కేసులు పెట్టడం ఫస్ట్​ టైం చూస్తున్న

ప్రశ్నించినోళ్లపై కేసులు  పెట్టడం ఫస్ట్​ టైం చూస్తున్న

ఖమ్మం టౌన్, వెలుగు : బీఆర్​ఎస్​ పాలనలో ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం ఫస్ట్​ టైం చూశానని భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించాలంటే బీఆర్​ఎస్​కు ఈఎన్నికల్లో బుద్ధి చెప్పి కాంగ్రెస్​ను గెలిపించుకోవాలని సూచించారు. సోమవారం సిటీలోని ఎస్ఆర్ గార్డెన్ లో  నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఖమ్మం నియోజకవర్గ సమన్వయ సమావేశంలో భట్టి విక్రమార్కతోపాటు కాంగ్రెస్​ నేతలు తుమ్మల నాగేశ్వరరావు

పొంగులేటి శ్రీనివాసరెడ్డి,  సీపీఐ నేతకూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 స్థానాల్లో కాంగ్రెస్​ జెండా ఎగురుతుందని పలు సర్వేలు చెబుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అమలు చేస్తామని ఆయన స్పష్టంచేశారు. 

Also Read:- ఆఫీసర్ల నిర్లక్ష్యం.. ఆగమవుతున్న హరితహారం