
కేసీఆర్ రైస్ మిల్లర్లతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు.. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి. రాష్ట్రంలో 24 గంటల్లో వడ్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దొంగ దీక్షలు చేస్తూ కేసీఆర్ రైతులను దగా చేస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేయకుండా టీఆర్ఎస్, బీజేపీలు డ్రామాలాడుతున్నాయని ఫైర్ అయ్యారు దాసోజు శ్రవణ్. ఇద్దరూ ధర్నాలు చేస్తే... రైతులను ఆదుకునేది ఎవరని ప్రశ్నించారు.