గోమాస శ్రీనివాస్ నోరు అదుపులో పెట్టుకో : చల్లా రాంరెడ్డి

గోమాస శ్రీనివాస్ నోరు అదుపులో పెట్టుకో : చల్లా రాంరెడ్డి
  • ఎమ్మెల్యే వివేక్​పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం
  • మండిపడ్డ కాంగ్రెస్​ నేతలు

చెన్నూరు, వెలుగు: బీజేపీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, డీసీఎం ఎస్ చైర్మన్ చల్లా రాంరెడ్డి అన్నారు. ఆదివారం చెన్నూర్​లోని ప్రెస్ క్లబ్​లో నిర్వహించిన ప్రెస్ మీట్​లో మాట్లాడారు. గొమాస శ్రీనివాస్ శనివారం వడ్ల కొనుగోలు సెంటర్లను విజిట్ చేసిన అనంతరం ఎమ్మెల్యే వివేక్​పై లేనిపోని ఆరోపణలు చేస్తూ, వ్యక్తిగతంగా దూషించడం కరెక్ట్ కాదన్నారు. గత ప్రభుత్వ హయాంలో కొనుగోలు సెంటర్ల వద్ద రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి బాధలు తీరాయన్నారు. నియోజకవర్గంలోని వడ్ల కొనుగోలు 

సెంటర్లలో వరి ధాన్యం తరలించడం కోసం 

పెద్దపెల్లి, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు, సివిల్ సప్లై అధికారులు, మంత్రి శ్రీధర్ బాబుతో ఎమ్మెల్యే వివేక్ మాట్లాడి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూశారని తెలిపారు. ఇప్పటికే 90శాతం వడ్లు మిల్లర్లకు చేరేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఈ విషయాలేం తెలుసుకోకుండా బీఆర్ఎస్, బీజేపీ నాయకులు నోరు పారేసుకోవటం సరికాదన్నారు. 

ఎమ్మెల్యే వివేక్​కు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాకా కుటుంబం తరతరాలుగా పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజలకు ఎనలేని సేవలు అందిస్తోందని గుర్తుచేశారు. గొడిషల బాపురెడ్డి, ఐత హేమంత రెడ్డి, సుశీల్ కుమార్, చింతల శ్రీనివాస్, శ్రీధర్, అన్వర్, చెన్న వెంకటేశ్, రాజేశ్, కార్యకర్తలు పాల్గొన్నారు.

వివేక్​పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం..

జైపూర్(భీమారం): చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రజల పాలిట పెన్నిది అని కాంగ్రెస్​ లీడర్లు అన్నారు. భీమారం మండలానికి చెందిన బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు ఎమ్మెల్యే వివేక్​పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై భీమారంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ సీనియర్ లీడర్ పొడేటి రవి మాట్లాడుతూ.. గోమాస శ్రీనివాస్ ఓటమి భయంతో మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడని ఫైర్ ​అయ్యారు. కాంగ్రెస్ పార్టీ రైతుల మేలు కోరుతుందని, మండలంలో ధాన్యం కొనుగోలు సజావుగా సాగుతోందన్నారు. 

ధాన్యం కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని ఎమ్మెల్యేతోపాటు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు అధికార యంత్రాంగానికి సూచించినట్లు చెప్పారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో   ఒక్కో రైతు నుంచి 8 కిలోల ధాన్యం కోత పెట్టి దోచుకున్నారని మండిపడ్డారు. పార్టీ మండల ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి, నాయకులు భూక్య లక్ష్మణ్, వేల్పుల శ్రీనివాస్, ప్రకాశ్ రెడ్డి, వెంకటేశ్వర్లు, రమేశ్, సమ్మయ్య, బాలరాంరెడ్డి, సత్తిరెడ్డి, రాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.