
షాద్ నగర్: ఢిల్లీ శ్రీరామ్ యూనివర్సిటీలో చదువుతున్న ఐశ్వర్య రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పొన్నం ప్రభాకర్, సంపత్ కుమార్ , వంశీచంద్ రెడ్డి,వీర్లపల్లి శంకర్ లు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థిని కుటుంబానికి తాము అండగా ఉంటామన్నారు. ఐశ్వర్య చెల్లెలు వైష్ణవి చదువు బాధ్యత తమ మీద ఉన్నదని, ఆమెను ఉన్నత చదువులు చదివిస్తామని అన్నారు.
ఐశ్వర్య ఆత్మహత్య ప్రభుత్వ హత్యగా భావిస్తున్నామని, ఇన్స్పైర్ స్కాలర్ షిప్ రానందుకే ఐశ్వర్య సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుందని అన్నారు .దేశ వ్యాప్తంగా ఉన్న స్కాలర్ షిప్ లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పార్టీ కార్యకలాపాలకు డబ్బులు ఉంటాయి కానీ.. ఇలాంటి చదువుల తల్లులకు నిధులు కేటాయించడక పోవడం ప్రభుత్వ వైఫల్యం గా భావిస్తున్నామని అన్నారు.
రెడ్డి సామాజిక వర్గంలో కూడా పేదవారు ఉంటే స్కాలర్ షిప్ లు కేటాయించాల్సి న బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న విద్య వ్యతిరేక విధానాలు వల్లే పేద విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. ఆన్లైన్ విద్యావిధానం ద్వారా విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఢిల్లీ లో చదువుతున్న ప్రతి ఒక్క రాష్ట్ర విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉండాలని కోరుతున్నామన్నారు.