వేంకటేశ్వర కల్యాణానికి మంత్రి వివేక్కు ఆహ్వానం

వేంకటేశ్వర కల్యాణానికి మంత్రి వివేక్కు ఆహ్వానం

రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం నందిగామ గ్రామంలో ఈనెల 2న నిర్వహించనున్న వేంకటేశ్వర స్వామి కల్యాణానికి హాజరుకావాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి, మైనింగ్‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామిని కాంగ్రెస్​ నాయకులు కోరారు.

మంగళవారం పటాన్‌‌‌‌‌‌‌‌చెరు కాంగ్రెస్​ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి కాట శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌గౌడ్​ ఆధ్వర్యంలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో మంత్రిని ఆయన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. మహా చండీ రుద్రయాగ సహిత కల్యాణ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించబోతున్నట్లు మంత్రికి వివరించారు.