
కోల్ బెల్ట్, వెలుగు: పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ పార్లమెంట్లో ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలోని కాంగ్రెస్లీడర్లు వేడుకలు చేసుకున్నారు. మంగళవారం మందమర్రి పాత బస్టాండ్ ఏరియాలో సీనియర్లీడర్, అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబురాలు జరిగాయి. ముందుగా లీడర్లు మారుతీనగర్‌లోని అభయాంజనేయ స్వామి ఆలయంలో వంశీకృష్ణ పేరిట ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ర్యాలీగా మందమర్రి పాత బస్టాండ్ చౌరస్తాకు చేరుకొని డిజే సౌండ్స్ మధ్య డ్యాన్స్‌లు చేశారు. స్థానికులకు పులిహోర ప్యాకెట్లు, స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బండి సదానందం మాట్లాడుతూ.. 60 ఏండ్లుగా కాకా వెంకటస్వామి కుటుంబం పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ప్రజలకు సేవలు చేస్తున్నారన్నారు. కాకా కుటుంబం మూడో తరానికి చెందిన విద్యావంతుడు, పారిశ్రామికవేత్త వంశీకృష్ణను ఎంపీగా గెలిపించడం వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
కార్యక్రమంలో నాయక పొడు సేవా సమితి సంఘం రాష్ట్ర కార్యదర్శి పెద్ది రాజన్న, బీఆర్ అంబేద్కర్ ఎస్టీ, బీసీ మైనార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు సలేంద్ర శ్రీనివాస్, నేతకాని కుల సంఘం లీడర్ సెగ్గం రవి కుమార్, యాదవ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నరేశ్ యాదవ్, నాగరాజు, ఎండీ ఇబ్రహీం, గోపతి శారద తదితరులు పాల్గొన్నారు. మందమర్రి మార్కెట్ఏరియాలో కాంగ్రెస్ నేతలు పటాకులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ రీజియన్ ఇన్చార్జ్కాంపెల్లి సమ్మయ్య, లీడర్లు తిరుమల్‌రెడ్డి, నర్సింగ్, ఎండీ పాషా, కిరణ్, బండి శంకర్ తదితరులు పాల్గొన్నారు.