నిర్మల్, వెలుగు: ఇంటర్ ఎగ్జామ్ పేపర్లో తప్పులు దొర్లడంతో విద్యార్థులు విస్తుపోయారు. గురువారం జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ తెలుగు పేపర్లో 13వ ప్రశ్న రెండవ బిట్ అయోమయానికి గురి చేసింది. ‘ఉపమాలంకారం’కు బదులుగా ‘ఉపపాలంకారం’గా అచ్చు కావడంతో విద్యార్థులు విస్తు పోయారు. ప్రశ్నాపత్రాన్ని ఒకటికి రెండు సార్లు పరిశీలించి ప్రశ్నలు ముద్రించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రశ్నలో మూడింటిలో ఒకటి మాత్రమే రాయాల్సి ఉండడంతో ప్రత్యామ్నాయంగా మరో రెండు బిట్లను ఎంచుకోవాల్సి వచ్చిందని విద్యార్థులు తెలిపారు.
