వెలుగు, నెట్వర్క్: దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. గురువారం వరంగల్‌లో డీసీసీ ప్రెసిడెంట్ మహ్మద్ఆయూబ్, హనుమకొండ డీసీసీ ప్రెసిడెంట్ఇనుగాల వెంకట్రామ్రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు రాజీవ్‌గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. జనగామ డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ లకావత్ఆధ్వర్యంలో జిల్లా ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. వైరా రింగ్‌రోడ్డు సెంటర్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ నివాళులర్పించారు.
అనంతరం ఆయన నియోజకవర్గ కేంద్రంలో నిర్మిస్తున్న యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్భవన నిర్మాణ పనులను పరిశీలించారు. దమ్మపేట మండలం గుండుగులపల్లి క్యాంప్‌ఆఫీస్‌లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నివాళులర్పించగా, కామేపల్లి మండలం పాతలింగాలలోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ మెంబర్ రామ్‌రెడ్డి గోపాల్‌రెడ్డి నివాళులర్పించారు. ఆయా మండల కేంద్రాల్లో నాయకులు, నేతలు నివాళులర్పించి, ఆయన సేవలను కొనియాడారు.
