గాంధి భవన్ వద్ద ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్దం

గాంధి భవన్ వద్ద ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్దం

ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ దేశాన్ని దోపిడి చేస్తున్నారంటూ కాంగ్రెస్ మహిళా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ ఆవరణలో ఇవాళ మహిళా కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో చేస్తున్న ధర్నాకు సంఘీభావంగా గాంధీ భవన్ వద్ద వారు ధర్నా చేపట్టారు. నిత్యావసర సరుకులతో, ప్లకార్డ్స్ తో నిరసనను తెలియజేశారు.

సరుకుల ధరలు వెంటనే తగించాలని మహిళా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కార్యకర్తలు పీఎం మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మోడీ, కేసీఆర్ లు దేశాన్ని దోచుకుంటున్నారని నినాదించారు. గాంధీ భవన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా చేరుకున్నారు.