- బాల్క సుమన్ఆరోపణలపై కాంగ్రెస్ లీడర్ల ఫైర్
కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్మండలం షెట్పల్లిలో ఇద్దరు గీత కార్మికుల మధ్య జరిగిన కుటుంబ తగాదాల విషయంలో మంత్రి వివేక్ వెంకటస్వామిపై బాల్క సుమన్చేసిన ఆరోపణలు సరికాదని గ్రామ కాంగ్రెస్ లీడర్లు మండిపడ్డారు. సోమవారం రాత్రి ప్రెస్‌నోట్ నిర్వహించిన గ్రామస్తులు, కాంగ్రెస్ లీడర్లు ఖండించారు.
లీడర్లు తాళ్లపల్లి కిరణ్, సురేశ్గౌడ్మాట్లాడుతూ.. గత కొద్ది కాలంగా ఇద్దరు గౌడ కులస్తుల మధ్య వ్యక్తిగతంగా, ఫ్యామిలీ పరంగా, భూతగాదాలున్నాయని.. వారు సోమవారం మరోసారి గొడవపడితే ఈ ఘటనను మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రాజకీయంగా మార్చి మంత్రి వివేక్ వెంకటస్వామిపై అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు.
బీఆర్ఎస్ హయాంలో హత్య రాజకీయాలను ప్రోత్సాహించారని, అందుకే చెన్నూరు ప్రజలు బాల్క సుమన్‌కు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. అయినప్పటికీ సుమన్, బీఆర్ఎస్ లీడర్లకు బుద్ధి రావడం లేదని మండిపడ్డారు. చెన్నూరు నియోజకవర్గ అభివృద్ది కోసం నీతినిజాయితీతో కూడిన పాలనను అందిస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామిపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోబోమన్నారు. ఇలాంటి ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
