అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించిన కాంగ్రెస్

అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించిన కాంగ్రెస్

హైదరాబాద్ : మున్సిపల్  పోల్స్ పై రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన అఖిలపక్ష సమావేశాన్ని కాంగ్రెస్ బహిష్కరించింది. రిజర్వేషన్లు ఖరారు చేయకుండా ఎన్నికలు పెట్టడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, నిరంజన్ బయటికి వచ్చారు.TRS, MIM మినహా మిగితా పార్టీలన్నీ రిజర్వేషన్లు ప్రకటించాకే ఎన్నికలు జరపాలని కోరినా.. ఎన్నికల సంఘం పట్టించుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు.

షెడ్యూల్ ను మార్చి.. సంక్రాంతి తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంబించాలని ఆయన డిమాండ్ చేశారు. అధికార పార్టీకి ఎన్నికల సంఘం వత్తాసు పలుకుతుందని పీసీసీ అధికార ప్రతినిధి నిరంజన్ విమర్శించారు. నాగిరెడ్డి నియంతలా వ్యవహరస్తున్నారని, రాజకీయ పార్టీల మీద దురుసుగా మాట్లాడారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ TRS పార్టీ కార్యాలయంలా మారిందని లోక్ సత్తా  పార్టీ అధ్యక్షుడు నాగరాజు అన్నారు. కుట్ర పూరితంగా బీసీ, మహిళా రిజర్వేషన్లు తగ్గించారని ఆరోపించారు.