సదాశివపేట, వెలుగు: ముంబై–హైదరాబాద్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోగా, మరో 9 మంది గాయపడ్డారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట హైవేపై ఆదివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. సీఐ వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ బోరబండకు చెందిన సుశాంత్ తన స్నేహితులతో కలిసి తుపాన్ వెహికల్లో హైదరాబాద్ నుంచి బీదర్ కు వెళ్తుండగా, సదాశివపేట శివారులో వెహికల్ అదుపు తప్పి పల్టీ కొట్టింది.
పక్కనే ఉన్న గుంతలో వాహనం పడిపోవడంతో డ్రైవింగ్ చేస్తున్న సుశాంత్(21) చనిపోయాడు. మిగిలిన 9 మందికి గాయాలు కాగా, సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
