లిఫ్ట్ స్కీముల రిపేర్లకు నిధులు మంజూరు చేయండి : వినయ్​రెడ్డి

లిఫ్ట్ స్కీముల రిపేర్లకు నిధులు మంజూరు చేయండి :  వినయ్​రెడ్డి
  • మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరిన నాయకులు 

​నందిపేట, వెలుగు: ఉమ్మడి నందిపేట మండలంలోని ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని శనివారం కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్​ నియోజకవర్గ ఇంచార్జి వినయ్​రెడ్డి, ఎత్తిపోతల చైర్మన్లు హైదరాబాద్​ లో మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి ని కలిసి వినతిపత్రం అందజేశారు.  ఆశించిన వర్షాలు లేక బోరు బావుల్లో నీరు అడుగంటిందని, ఉమ్మడి నందిపేట మండలంలో ఎత్తిపోతలే ఆధారమని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.  

నిధులు మంజూరు చేసి ఈ ప్రాంత రైతులను ఆదుకోవాలని వారు మంత్రికి విన్నవించారు.  మంత్రి సానుకూలంగా స్పందించారని నిధుల మంజూరుకు హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.  మంత్రిని కలిసిన వారిలో డీసీసీ ఉపాధ్యక్షుడు పెంట ఇంద్రుడు, ఎత్తిపోతల చైర్మన్లు బోజారెడ్డి, ఓంకార్, తదితరులు ఉన్నారు.