
లింగంపేట, వెలుగు: లింగంపేట మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ లీడర్లు గురువారం హైదరాబాద్‌లో స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావును కలిశారు. లింగంపేట సమీపంలోని మత్తడి పోచమ్మ గుడి వరకు, లింగంపేట పోలీస్‌స్టేషన్‌నుంచి పోస్టాఫీస్వరకు ఉన్న పానాది రోడ్లపై సీసీ వేయాలని, మండల కేంద్రంలోని బాలికల హైస్కూల్, ప్రైమరీ స్కూల్లో కనీస వసతులు కల్పించాలని సీనియర్ లీడర్ బుర్రా నారాగౌడ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి పనులను ప్రారంభించాలని ఆదేశించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఖుద్దూస్, సాయిరాం, రాజు, నగేశ్, కిరణ్ తదితరులు ఉన్నారు.