రైతులకు క్షమాపణ చెప్పాకే.. నల్గొండలో కేసీఆర్ అడుగుపెట్టాలి -విప్ బీర్ల అయిలయ్య

రైతులకు క్షమాపణ చెప్పాకే.. నల్గొండలో కేసీఆర్ అడుగుపెట్టాలి -విప్ బీర్ల అయిలయ్య

కాంగ్రెస్ ప్రభుత్వంపై  బీఆర్ఎస్ లేనిపోని ఆరోపణలు చేస్తుందని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు.  మరోసారి సెంటిమెంట్ రాగిల్చి కేసీఆర్ రాజకీయాలు చేయాలనుకుంటున్నారని ఆరోపించారు.  పది సంవత్సరాలు ఏమి చేయక .. ఇప్పుడు ఓటమిని జీర్ణించుకోలేక ప్రజలను సెంటిమెంట్ తో రెచ్చగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.  నల్లగొండ రైతులకు కేసీఆర్ క్షమాపణలు చెప్పి ఈ గడ్డమీద అడుగుపెట్టాలని డిమాండ్  చేశారు. ధర్నా లకు తమకేం అభ్యంతరం లేదన్నారు.

ఎన్నికలోచ్చినప్పుడు ప్రజలను రెచ్చగొట్టడం కేసీఆర్ కు అలవాటేనని విమర్శించారు  బీర్ల ఐలయ్య.  ఓట్లకోసం నాటకాలు నడవవువని... బీఆర్ఎస్  పిట్ట బెదిరింపులకు కాంగ్రెస్ భయపడదని చెప్పారు.  ప్రాజెక్టులపై అసెంబ్లీలో మాట్లాడేందుకు సమయం ఇస్తామని..   చర్చకు రావాలని సవాల్ విసిరారు.  

ALSO READ :- అయోధ్య రామ్ లల్లాను పోలిన వెయ్యేళ్లనాటి విష్ణు విగ్రహం

జగన్ తో లోపాయికార ఒప్పందంలో భాగంగానే నీళ్లను కేసీఆర్  ఏపీకి అప్పగించారని ఆరోపించారు బీర్ల ఐలయ్య.  తన ఫామ్ హౌస్ కి నీళ్లు తెచ్చుకున్న కేసీఆర్..  చుట్టుపక్కల మండలాలకు నీళ్లు ఇవ్వలేదన్నారు.  నీళ్లు, నిధులు, నియామకాలు అన్ని కేసీఆర్ కుటుంబానికి పోయాయన్నారు. ఎన్నికల టైమ్ లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.