అయోధ్య రామ్ లల్లాను పోలిన వెయ్యేళ్లనాటి విష్ణు విగ్రహం

అయోధ్య రామ్ లల్లాను పోలిన వెయ్యేళ్లనాటి విష్ణు విగ్రహం

కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో కృష్ణా నది నుంచి పురాతన విష్ణు విగ్రహం, శివలింగం లభ్యమయ్యాయి.  విష్ణు విగ్రహం అయోధ్యలో ప్రతిష్ఠించి రామ్ లల్లా విగ్రహానికి దగ్గర పోలికలు ఉన్నాయి.  దేవసుగూర్ గ్రామ సమీపంలో నదిపై వంతెన నిర్మాణ పనుల్లో శతాబ్దాల నాటి హిందూ దేవుళ్ల విగ్రహాలు బయటపడ్డాయి.

కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలోని ఒక గ్రామంలో కృష్ణా నదిలో శ్రీమహావిష్ణువు పురాతన విగ్రహం బయల్పడింది. విగ్రహం చుట్టూ దశావతారాలన్నీ నిండుగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఈ విగ్రహంతో పాటు పురాతన శివలింగం కూడా బయల్పడింది. అయితే నదిలో బయట్పడిన ఈ శ్రీమహావిష్ణువు విగ్రహం ఇటీవల అయోధ్యలోని  నూతన రామాలయంలో ప్రతిష్ఠించిన బాలరాముని విగ్రహాన్ని పోలివుండటం గమనార్హం. సిబ్బంది నదిలో విగ్రహాలను సురక్షితంగా వెలికితీసి వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించారు.

 ప్రత్యక్ష సాక్షుల ప్రకారం..   కృష్ణానది పరీవాహక ప్రాంతంలో లభించిన ఈ విష్ణుమూర్తి విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ  విష్ణువు విగ్రహం చుట్టూ  మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, రాముడు, పరశురాముడు, కృష్ణుడు, బుద్ధుడు, కల్కి తదితర దశావతారాలు అందంగా ఉన్నాయి. నదిలో లభించిన  విగ్రహాలలో శ్రీకృష్ణుడి దశావతారం, శివలింగం ఉన్నాయి. ఈ శ్రీ మహావిష్ణువు విగ్రహం   అనేక విలక్షణమైన లక్షణాలను ప్రదర్శిస్తుందని  రాయచూర్ యూనివర్సిటీ ప్రాచీన చరిత్ర, పురావస్తు అధ్యాపకురాలు డాక్టర్ పద్మజా దేశాయ్  తెలిపారు. విగ్రహం  నిలబడి ఉన్న భంగిమ ఆగమాలలో నిర్దేశించిన మార్గదర్శకాలకు కట్టుబడి  విగ్రహం అందంగా ఉందని ఆమె తెలిపారు.

ALSO READ :- గుండెలు బాదుకుందురు లెండి..యాత్రని ఆపలేరు..జగనన్న జైత్రయాత్రని ఆపలేరు: YSRCP

ఈ శ్రీమహా విష్ణువు విగ్రహ విశిష్టతల విషయానికొస్తే విష్ణుమూర్తి నిలువెత్తు భంగిమలో నాలుగు చేతులు కలిగి ఉన్నాడు. అతని పైరెండు చేతులలో శంఖుచక్రాలు ఉండగా, దిగువ చేతులు (‘కటి హస్త’, ‘వరద హస్త’) ఆశీర్వాదాలను అందిస్తున్నట్లు ఉన్నాయి. ఈ విగ్రహం వేంకటేశ్వరుని కూడా పోలి ఉంది. అయితే ఈ విగ్రహంలో గరుడుడు లేడు. సాధారణంగా శ్రీమహా విష్ణువు విగ్రహాలలో గరుడుడు కనిపిస్తాడు. విష్ణువు అలంకార ప్రియుడు కావడంతో ఈ మందహాసధర విష్ణుమూర్తి విగ్రహంపై పూమాలలు కూడా కనిపిస్తాయి.