బీఆర్ఎస్ అవినీతి పాలనను తరిమికొట్టాలి: కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్

బీఆర్ఎస్ అవినీతి పాలనను తరిమికొట్టాలి: కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్

గచ్చిబౌలి, వెలుగు: బీఆర్ఎస్ అవినీతి కుటుంబ పాలనను తరిమికొట్టాలని.. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు కాంగ్రెస్​ను గెలిపించాలని ఆ పార్టీ శేరిలింగంపల్లి అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం  వివేకానందనగర్​ డివిజన్​లోని రామకృష్ణానగర్, హనుమాన్​నగర్, ఆర్పీ కాలనీలో ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను తాను గెలిచిన వెంటనే అమలు చేస్తానని తెలిపారు.  ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు.