చెప్పినోళ్లని చేసుకోకపోతే కళ్యాణలక్ష్మి ఇవ్వనంటాడేమో

చెప్పినోళ్లని చేసుకోకపోతే కళ్యాణలక్ష్మి ఇవ్వనంటాడేమో

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌య‌లో సీఎం కేసీఆర్ రైతులను కొండెక్కించారని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి. తెలంగాణ వ‌చ్చి ఆరేళ్ళు అవుతున్నా.. రైతుల మొహాలలో సంతోషం లేదని అన్నారు. ఎన్నికల ముందు రైతుబంధు పేరుమీద ఓట్లు దండుకొని టీఆరెస్ రాజకీయాలు చేస్తోందని అన్నారు. టీఆరెస్ ప్రభుత్వంలో రైతులకు పంటనష్టం జ‌రిగింద‌ని, రైతుల‌కు గిట్టుబాటు ధర కూడా క‌ల్పించ‌లేదని అన్నారు. కేసీఆర్ రైతా..? లేక రాజకీయ నాయకుడా? సమాధానం చెప్పాలన్నారు.

ఎకరానికి ఐదు వేలు ఇస్తా అన్న కేసీఆర్.. ఇప్పటికి వరకు రైతులకు పూర్తిగా రైతుబంధు రావడం లేదన్నారు. గతేడాది రైతు బంధు 60శాతం రాలేదని, ఈ ఏడాది అస‌లు వస్తుందా? రాదా? అనేది కూడా ఎవ్వరికి తెలియ‌దని జ‌గ్గారెడ్డి అ‌న్నారు. తాజాగా ప్రభుత్వం చెప్పిన పంటే వేయాలనే కేసీఆర్ నిబంధన పెడుతున్న‌డంటే.. రైతు బంధు వదిలించుకునే ప్రయత్నమే జ‌రుగుతున్న‌ట్టు అనిపిస్తోంద‌న్నారు. రైతు బంధు లానే రేపు తాను చెప్పిన పిల్లనో ,పిలగాన్నో చేసుకోకపోతే కళ్యాణ లక్ష్మీ కూడా ఇవ్వనంటాడోమోన‌ని జ‌గ్గారెడ్డి అన్నారు.