తెలంగాణ సెంటిమెంట్ను కేసీఆర్ చంపేసిండు : జగ్గారెడ్డి

తెలంగాణ సెంటిమెంట్ను కేసీఆర్ చంపేసిండు : జగ్గారెడ్డి

బీఆర్ఎస్ తో తెలంగాణ సెంటిమెంట్ ను కేసీఆర్ చంపేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యాలయాలు ఎక్కడైన పెట్టుకోవచ్చు అన్నారు. బీఆర్ఎస్ ప్రకటనతోనే చంద్రబాబు తెలంగాణకు వస్తున్నారని జగ్గారెడ్డి చెప్పారు.

ఏపీలో బీఆర్ఎస్ ప్రభావం ఉండదని.. అలాగే చంద్రబాబు ఎఫెక్ట్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. మైనార్టీ కార్పొరేషన్ కు బడ్జెట్లో రూ.1500 కోట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలకు 120 కోట్లు కేటాయించిదని దీనిపై సీఎం కేసీఆర్ కు గతంలోలేఖ రాశానని వెల్లడించారు.