ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన చలో ట్యాంక్ బండ్ కు తమ పార్టీ పూర్తి మద్దతిస్తుందన్నారు కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఉత్తమ్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ శ్రేణులన్నీ జేఏసీ కి మద్దతుగా చలో ట్యాంక్ బండ్ పాల్గొంటారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో చేపట్టిన మిలియన్ మార్చ్ రీతిలో ..చలో ట్యాంక్ బండ్ ప్రోగ్రామ్ ను సక్సెస్ చేస్తామని, అందుకు ప్రజలంతా సహకరించి ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవాలన్నారు.
చలో ట్యాంక్ బండ్ ప్రొగ్రామ్ లో ఎక్కడా పాల్గోంటామనే భయంతో ప్రభుత్వం ముందస్తు అరెస్టులు చేయిస్తుందన్నారు. ఈ అరెస్టులు.. తెలంగాణ పోలీసులు చేస్తున్నారా ..? మహారాష్ట్ర వాహనాలలో వచ్చి మహారాష్ట్ర పోలీసులు చేస్తున్నారా.? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. తెలంగాణాలో ప్రజలు ఉండాలా ..ఉండొద్దా ..? అని అడిగారు. రాష్ట్రంలో బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడుస్తున్నాయని, పోలీసులు ప్రశ్నించేవారిని భయకంపితులను చేస్తున్నారని అన్నారు.
ఎల్లకాలం కేసీఆర్ అధికారంలో, ఏకపక్షంగా అరెస్ట్ లు చేస్తున్న పోలీసులు ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని జగ్గారెడ్డి సూచించారు. భవిష్యత్ లో కాంగ్రెస్ ,బీజేపీ ఎవరు అధికారంలోకి వచ్చినా.. ఇప్పుడు ఇబ్బందులు పెడుతున్న పోలీసులకు కస్టాలు తప్పవని హెచ్చరించారు.
ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వారికి హైకోర్టు న్యాయం చేస్తుందని నమ్ముతున్నామని జగ్గారెడ్డి అన్నారు.

