చంద్రబాబు అరెస్ట్ పై స్పందించిన ఎమ్మెల్యే సీతక్క

చంద్రబాబు అరెస్ట్ పై  స్పందించిన ఎమ్మెల్యే సీతక్క

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. చంద్రబాబును అలా అరెస్ట్ చేయడం తప్పని.. అంత పెద్ద వయసులో ఉన్న వ్యక్తిని జైల్లో పెట్టడం సరైంది కాదంటూ విమర్శించారు. ఆయన 40 ఏళ్ల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నారని చెప్పారు. రూ. లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారని.. ఎన్నో పరిశ్రమలు తెచ్చారన్నారు.  ఈ కేసులో రాజకీయ కోణాలే ఉన్నాయని అందరికీ అర్థ మవుతోందన్నారు.

మరో వైపు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో  ఇవాళ(సెప్టెంబర్ 24) రెండోరోజు  చంద్రబాబును ఏపీ సీఐడీ విచారణ విచారిస్తోంది.  జైల్లోనే  చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేశారు. చంద్రబాబు కస్టడీ ఇవాళ్టితో ముగుస్తుంది. కస్టడీ పొడిగింపుపై  సాయంత్రం తెలుస్తోంది.

ALSO READ : తిరుమలలో టిటిడి ఎలక్ట్రిక్‌ బస్సు చోరీ

సెప్టెంబర్ 23న రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉదయం తొమ్మదిన్నర నుంచి సాయంత్రం 5 గంటల వరకూ.. బాబును ప్రశ్నించారు. 6 గంటల పాటు జరిగిన విచారణలో స్కిల్ స్కాంలో కీలక విషయాలపై ప్రశ్నలు అడిగారు అధికారులు.  మధ్యలో గంట సేపు లంచ్ బ్రేక్ ఇచ్చారు. చంద్రబాబు తరపు లాయర్ సమక్షంలో విచారణ జరిగింది. నిన్నటి విచారణలో మొత్తం 12 మంది సీఐడీ అధికారులు పాల్గొన్నారు.