కేటీఆర్.. అడ్డంగా బుక్ అయిండు: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

కేటీఆర్.. అడ్డంగా బుక్ అయిండు: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

సిట్ విచారణకు ముందే కేటీఆర్ చట్టానికి అడ్డంగా దొరికిపోయారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. మీడియాకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరిగితే పోలీసులు ట్యాప్ చేస్తారని కేటీఆర్ అనడాన్ని గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ అయి ఉండొచ్చని కేటీఆర్ పరోక్షంగా ఆయన మాటాలతోనే ఒప్పుకుంటున్నారన్నారు.

దీంతో కేటీఆర్ సిట్ విచారణకు హాజరుకావడానికి ముందే తాను ట్యాప్ చేశాననే విషయం చెప్పకనే చెప్పినట్లు అయిందని తెలిపారు. సిగ్గు లేకుండా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ను కేటీఆర్ అంగీకరించడం ఆయన దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని మండిపడ్డారు.