Balmoori Venkat: ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు దగ్గరకు శ్రీకాంత్ అయ్యంగార్ వ్యాఖ్యల వివాదం

Balmoori Venkat: ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు దగ్గరకు శ్రీకాంత్ అయ్యంగార్ వ్యాఖ్యల వివాదం

టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్, మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్రీకాంత్‌ అయ్యంగార్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు, జనరల్ సెక్రటరీ శివ బాలాజీలను కలిసి కంప్లెయింట్ చేశారు. 

గాంధీజీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నటుడు శ్రీకాంత్పై కఠిన చర్యలు తీసుకోవాలని బల్మూరి వెంకట్‌ విజ్ఞప్తి చేశారు. తక్షణమే శ్రీకాంత్ మా అసోసియేషన్ సభ్యత్వం తొలిగించాలని కోరారు. ఈ విషయంలో టాలీవుడ్ సినీ పెద్దలు సైతం స్పందించి శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలను ఖండించాలన్నారు.

ఈ విషయంపై జనరల్ సెక్రటరీ శివ బాలాజీ స్పందిస్తూ..‘‘ ‘మా’ కు డిసిప్లినరీ కమిటీ ఉంది. అందరం ఏకధాటిగా చర్చించి ఒక నిర్ణయానికి వస్తాం. ఈ వ్యాఖ్యల వ్యవహారంపై త్వరలోనే మీటింగ్‌ పెట్టి.. శ్రీకాంత్ పై తగిన చర్యలు తీసుకుంటామని’ శివ బాలాజీ అన్నారు. ఇప్పటికే శ్రీకాంత్‌ అయ్యంగార్‌పై చాలాచోట్ల ఫిర్యాదులు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ విషయంలో ‘మా’ ఎలాంటి చర్యలు తీసుకోనుందో తెలియాల్సి ఉంది.