కేసీఆర్ మాటలు నమ్మి రైతులు మోసపోయిన్రు

కేసీఆర్ మాటలు నమ్మి రైతులు మోసపోయిన్రు

కరీంనగర్: కేసీఆర్ మాటలు నమ్మి తెలంగాణ రైతులు మోసపోయారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. వరి వేస్తే ఉరే అని సీఎం కేసీఆర్ చెప్పడం వల్లే చాలా మంది రైతులు వరి సాగు లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వరి వేయకుండా నష్టపోయిన రైతులందరికీ ఎకరానికి రూ. 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వడ్ల కొనుగోలుకు రూ.3500 కోట్లు భరిస్తున్నామన్న కేసీఆర్, వరి వేయని రైతుల కోసం రూ.1500 కోట్లు భరించలేరా అంటూ ప్రశ్నించారు. లేకుంటే కాంగ్రెస్ ఆధ్యర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. 

ఇవి కూడా చదవండి..

ఐఏఎస్ శ్రీలక్ష్మి పిటిషన్ కొట్టేసిన ఏపీ హైకోర్టు

అక్బరుద్దీన్పై నమోదైన కేసుల కొట్టివేత