ఈటెల తిరుగుబాటుతో కేటీఆర్ సీఎం కాలేదు అక్కడ మోడీ..ఇక్కడ కేడీ ఇద్దరు ఒకటే

ఈటెల తిరుగుబాటుతో కేటీఆర్ సీఎం కాలేదు అక్కడ మోడీ..ఇక్కడ కేడీ ఇద్దరు ఒకటే

మోడీ, కేడీ (కేసీఆర్) ఇద్దరు ఒకటే అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తెలంగాణలో కేసీఆర్ గెలవొద్దు అని బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందం చేసుకున్నాయని మండిపడ్డారు. దేశంలో నీతి, నియమం లేని నాయకులు మోదీ, కేసీఆర్ లు అని విమర్శించారు. కేటీఆర్ ను సీఎం చేస్తానని మోదీని కేసీఆర్ అడిగే ఉంటాడని...ఇందులో ఆశ్చర్యం ఏం లేదన్నారు. అయితే ఈటెల రాజేందర్ తిరుగుబాటుతో కేటీఆర్ సీఎం కాలేదని చెప్పారు. అయినా కూడా తెలంగాణ ప్రభుత్వంలో కేటీఆర్..సీఎం తర్వాత సీఎం అని తెలిపారు. 

మంత్రి కేటీఆర్ సిరిసిల్లను, జగిత్యాలను జిల్లా చేసుకున్నాం అని అనడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాలకు వచ్చిన కేటీఆర్..తన ప్రసంగంలో యావర్ రోడ్డు ప్రస్తావన లేకపోవడంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని చెప్పారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో  సిరిసిల్ల, జగిత్యాల, వేములవాడలో బైపాస్ రోడ్లు ఏర్పాటు చేశానని గుర్తు చేశారు. జగిత్యాలకు JNTU యూనివర్సిటీ, NAC సెంటర్, వ్యవసాయ కళాశాలను తీసుకొచ్చినట్లు చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ ను  అమలు చేసినప్పుడు ఎక్కడ ఉన్నావు కేటీఆర్ అని ప్రశ్నించారు. మోడీ తెలంగాణకు ఏం చేయలేదని మండిపడ్డారు. బిఆర్ఎస్, బీజేపీ లు ఇద్దరు తోడు దొంగలే అని విమర్శించారు.