రైస్ మిల్లర్ల దోపిడిని అరికట్టడంలో మంత్రి విఫలం

రైస్ మిల్లర్ల దోపిడిని అరికట్టడంలో మంత్రి విఫలం

జగిత్యాల: ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైస్ మిల్లర్ల దోపిడిని అరికట్టడంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ విఫలమయ్యారనిని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నే.. మిల్లర్ల దోపిడీపై అధికారులకు ఫిర్యాదు చేశాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. అక్రమాలను అరికట్టాల్సిన మంత్రి ఈశ్వర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. మరో వైపు 5 ఏళ్ల కిందట ప్రారంభించిన రోళ్ల వాగును ఇప్పటికీ పూర్తి చేయకపోవడం..ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమి జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు.