రైతులతో కలిసి జీవన్ రెడ్డి ఆందోళన.. అరెస్ట్కు పోలీసుల యత్నం

రైతులతో కలిసి జీవన్ రెడ్డి ఆందోళన.. అరెస్ట్కు పోలీసుల యత్నం

మాస్టర్ ప్లాన్ రద్దు కోసం జగిత్యాల అష్టదిగ్బంధనానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నా నిర్వహిస్తున్నారు. జగిత్యాల జిల్లా తిప్పన్నపేట వద్ద రైతులు చేపట్టిన ఆందోళనకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఆందోళన విరమించాలని పోలీసులు కోరినా.. జీవన్ రెడ్డి ససేమీరా అన్నారు. ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా మహిళా రైతులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరకు పోలీసుల విన్నపంతో జీవన్ రెడ్డి సహా రైతులు ఆందోళన విరమించారు. 

మరోవైపు మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా మిగతా గ్రామాల్లోనూ ఆందోళనలు మిన్నంటాయి. అన్నదాతల ఆందోళన నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.  వాహనాలు బారులు తీరి ఇబ్బంది కలుగుతున్నా ప్రయాణికులు మాత్రం రైతులకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతుల డిమాండ్ మేరకు మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని కోరుతున్నారు. మరోవైపు నర్సింగాపూర్లో గ్రామ పంచాయితీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేసే వరకు నిరనసలు కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు.