- కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సవాల్
హైదరాబాద్, వెలుగు: హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ చర్చకు సిద్ధమా.. అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం గాంధీ భవన్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పరిశ్రమల భూమి బదలాయింపు విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ లు తీసుకువచ్చిన పాలసీలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఆ ధైర్యం బీఆర్ఎస్ నేతలకు ఉందా అని ప్రశ్నించారు. గతంలో భూమి కొనుగోలు చేసి పరిశ్రమలు పెట్టిన వారికే పాలసీ వర్తిస్తుందన్నారు.
