మునుగోడులో నన్ను తిట్టినోళ్లపై విచారణ చేయాలి : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మునుగోడులో నన్ను తిట్టినోళ్లపై విచారణ చేయాలి : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ప్రతీ కార్యకర్త పీసీసీ చీఫ్ తో సమానమేనని కాంగ్రెస్​ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీల్లో.. గాంధీభవన్ లో ఉంటూ పైరవీలు చేసుకునే వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలపై అధ్యయనానికి దిగ్విజయ్ ను నియమించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇప్పటికైనా పార్టీలో మార్పు వస్తుంద‌ని ఆశిస్తున్నానని ఆయన తెలిపారు. హుజూరాబాద్ లో రేవంత్ ప్రచారానికి ఎందుకు వెళ్లలేదో విచారణ చేయాలని హైకమాండ్ ను డిమాండ్ చేశారు. మునుగోడులో తనను బూతులు తిడుతున్న వారిపై విచారణ చేయాలని డిమాండ్​ చేశారు. 

పార్టీ కమిటీల్లో తాము ఇచ్చిన పేర్లను పట్టించుకోలేదని వెంకట్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ లో సీనియర్లకు అన్యాయం జరిగిందన్నారు. కాగా, తెలంగాణలో కనీసం మౌలిక సదుపాయాలు లేవని మండిపడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు.. ఆరోగ్య శ్రీ పనిచేయడం లేదని విమర్శించారు. పక్క రాష్ట్రంలో వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్య శ్రీ అమలవుతోందని.. మన రాష్ట్రంలో మాత్రం ఆ నిబంధన ఎందుకు అమలుకావడం లేదని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.