భగత్ సింగ్ కు భారత రత్న ఇవ్వండి: మోడీకి కాంగ్రెస్ ఎంపీ లేఖ

భగత్ సింగ్ కు భారత రత్న ఇవ్వండి: మోడీకి కాంగ్రెస్ ఎంపీ లేఖ

స్వాతంత్ర సమరయోధులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లకు భారతరత్న ఇవ్వాలని కోరారు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ. ఇందుకుగాను.. ప్రధాని నరేంద్ర మోడీకి లెటర్ రాశారు. బ్రిటీష్ సామ్రాజ్యవాదంపై పోరాడి వీరమరణం పొందిన వీరు భారత స్వాతంత్రోద్యమానికి ఊపిరులు ఊదారని అన్నారు. ఇప్పటికీ వారిని ప్రజలు.. ‘షహీద్-ఇ-ఆజం’ బిరుదుతో సత్కరించుకుంటున్నరని అన్నారు. మొహలీ లోని ఎయిర్ పోర్ట్ కు ‘షహీద్-ఇ-ఆజం భగత్ సింగ్’ అని పేరు పెట్టుకున్నారని చెప్పారు. 2020 వ సంవత్సరం గణతంత్ర దినోత్సవంలో వీరు ముగ్గురికి భారతరత్న ఇచ్చి గౌరవించాలని కోరారు.