కోదాడలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం పక్కా

కోదాడలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం పక్కా

సూర్యాపేట: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికి 50 వేల మెజారిటీ కంటే  ఒక్క ఓటు తగ్గినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.  కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రచ్చ బండ, రైతు భరోసా యాత్రలో భాగంగా మంగళవారం కోదాడ మండలంలోని కాపుగల్లు గ్రామంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించడం ఖాయమన్నారు. అదే విధంగా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళా సంఘాలకు సంబంధించిన బకాయిలను మాఫీ చేస్తామన్నారు. అలాగే మహిళలు తీసుకున్న బ్యాంకు రుణాలకు సంబంధించిన వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు.