స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలవబోతున్నారు: మంత్రి వివేక్ వెంకటస్వామి

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలవబోతున్నారు: మంత్రి వివేక్ వెంకటస్వామి

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలవబోతున్నారని అన్నారు  రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మంగళవారం (డిసెంబర్ 03) మంచిర్యాల జిల్లా మందమర్రి బి1 ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి.. రాజకీయాలకు ఫౌండేషన్ గ్రామ స్థాయి ఎన్నికలని అన్నారు. 

కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలతో ప్రజలందరూ  హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని అన్నారు. సర్పంచ్ లు గా పోటీ చేసే అభ్యర్థులు ఎక్కువ శాతం యునానిమస్  చేసుకుంటున్నారని అన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో  2 వందల కోట్లతో అభివృద్ధి పనులు జరగనున్నాయని అన్నారు. నియోజక వర్గాన్ని మోడ్రన్ చెన్నూరు గా చేయడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా చెప్పారు. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో కేటీఆర్ ఫెయిల్యూర్ లీడర్ అనేది మరోసారి రుజువు అవుతుందని విమర్శించారు.  సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించాలని ఆశావాహుల ఒత్తిడి ఎక్కువ గా ఉందిన్నారు. 

ఆర్కేపీ ఓపెన్ కాస్ట్ విస్తరణ పనులకు ప్రజా అభిప్రాయ సేకరణ శుభ పరిణామంఅని అన్నారు మంత్రి వివేక్.  ప్రజలందరూ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొని తమ అభిప్రాయాలను మినిట్స్ రికార్డ్ లో తెలియజేయాలని సూచించారు. కొత్త ఉద్యోగాలు రావాలంటే బొగ్గు గనులు రావాలని సూచించారు.