అన్ని మండల కేంద్రాల్లో నేడు కాంగ్రెస్​ ధర్నా

అన్ని మండల కేంద్రాల్లో నేడు కాంగ్రెస్​ ధర్నా

హైదరాబాద్​, వెలుగు: టీఎస్​పీఎస్సీ పేపర్​ లీక్​ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్​ పార్టీ నిర్ణయించింది. ఆదివారం అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు చేయాలని, కేటీఆర్​ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. ఈ విషయాన్ని పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కేసీఆర్​, కేటీఆర్​ పాలనలో ఉద్యోగ నియామకాలు జోక్​గా మారాయన్నారు. అవినీతి పెరిగిందని, ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని ఆయన మండిపడ్డారు.