యూపీఏ హయాంలో పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ 9 రూపాయలే

యూపీఏ హయాంలో పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ 9 రూపాయలే

దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 తగ్గించింది. తమ బాటలోనే రాష్ట్రాలు కూడా తగ్గించాలని కేంద్ర సర్కారు సూచించింది. ఎన్డీయే సర్కారు ఉన్న పలు రాష్ట్రాలతో పాటు ఒడిశా లాంటి కొన్ని రాష్ట్రాల్లో పెట్రో పన్నులను రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాయి.

అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెట్రో పన్ను తగ్గింపు నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ ఇది సరిపోదని కామెంట్ చేసింది. పెట్రోల్, డీజిల్ ధరలు మరింత తగ్గించాలని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. యూపీఏ ప్రభుత్వం ఉండగా పెట్రోల్‌పై 9 రూపాయల 48 పైసలు, డీజిల్‌పై 3 రూపాయల 56 పైసలు మాత్రమే ఎక్సైజ్ డ్యూటీ ఉన్న విషయం గుర్తు చేశారు. వంట గ్యాస్ రేట్లు కూడా భారీగా తగ్గించాలన్నారు. ఈ నెల 14న దేశవ్యాప్తంగా భారీ ఆందోళన చేపట్టనున్నట్టు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం..

రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్

కశ్మీర్‌‌లో మెడికల్ కాలేజీపై టెర్రర్ అటాక్

హైదరాబాద్‌లో వరుస హత్యలు.. సైకో కిల్లర్ అరెస్ట్