జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్అభ్యర్థి నవీన్యాదవ్ఘన విజయం సాధించడంతో ఉమ్మడి ఆదిలాబాద్జిల్లాలోని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం సంబరాలు జరుపుకున్నారు. పటాకులు కాల్చి, స్వీట్లు తినిపించుకున్నారు. ఈ గెలుపుతో హైదరాబాద్‌లో కాంగ్రెస్బలపడిందని తెలిపారు. బీఆర్ఎస్ఫేక్ప్రచారాన్ని అక్కడి ప్రజలు నమ్మలేదన్నారు.
ఉప ఎన్నిక సందర్భంగా జూబ్లీహిల్స్‌కు ఇన్చార్జులుగా ఉన్న మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్‌గౌడ్, తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్శ్రేణులను సమన్వయం చేసి సక్సెస్అయ్యారని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థలు, జీహెచ్ఎంఎసీ ఎన్నికల్లోనూ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రామకృష్ణాపూర్ లోని కాంగ్రెస్ ఆఫీస్‌లో పీసీసీ మెంబర్, కాంగ్రెస్ సీనియర్‌నాయకుడు పిన్నింటి రఘునాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. చెన్నూరులోని మంత్రి క్యాంప్ ఆఫీస్ ఎదుట పటాకులు కాల్చారు. - నెట్వర్క్, వెలుగు
